Custody Trailer : పవర్‌ఫుల్‌ రోల్‌లో నాగచైతన్య.. కస్టడీ ట్రైలర్‌ అదిరిందిగా

5 May, 2023 16:59 IST|Sakshi

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో కృతిశెట్టితో పాటు మరో హీరోయిన్‌ ఆనంది సైతం నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి

ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. విజువల్స్‌, ఫైట్స్‌, డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: నాకిది పెద్ద షాక్‌, నా వల్ల కావడం లేదు: బోరుమని ఏడ్చేసిన సదా

మరిన్ని వార్తలు