పాట చాలా బాగుంది

12 Mar, 2023 05:59 IST|Sakshi

– నాగచైతన్య

తేజ్‌ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మాధవే మధుసూదన’. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘హోయ్‌.. అలాంటి అందం ఇలాంటి నేల మీద ఎలాగు పుట్టినాదో. ఏమో ఏమిటో...’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను హీరో నాగచైతన్య విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా బాగుంది. తేజ్‌కు కంగ్రాట్స్‌. మంచి ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించాలి. చంద్ర అండ్‌ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. వికాస్‌ బాడిస స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి పాడారు.

మరిన్ని వార్తలు