ఈ వారం బాక్సాఫీస్ పోటీలో ‘లవ్ స్టోరీ' వర్సెస్ ‘మరో ప్రస్థానం'

20 Sep, 2021 19:27 IST|Sakshi

ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. చాలా కాలం త‌రువాత థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నాయి. చాలా సినిమాలు ఓటీటీకే ప‌రిమితం కాగా, కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరీ కాగా రెండో సినిమా మ‌రో ప్ర‌స్థానం. ల‌వ్‌స్టోరీ సినిమాను భారీగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఆదివారం ల‌వ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు, అమీర్ ఖాన్ కూడా హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికే సినిమా పాటలు, ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

ఇక ఇదిలా ఉంటే, ల‌వ్‌స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే త‌నీష్ ‘మ‌రోప్ర‌స్థానం' సినిమా కూడా రిలీజ్ కాబోతున్న‌ది. విల‌న్ బృందం వ‌ర‌స హ‌త్యలు చేస్తుండ‌గా, వాటిపై స్ట్రింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి వాటిని సీక్రెట్ కెమెరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమెరా విల‌న్‌ల‌కు దొరుకుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశంలో థ్రిల్లింగ్‌గా క‌థ‌ను తెర‌కెక్కించారు. జానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈసినిమా సెప్టెంబ‌ర్ 24 వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న‌ది. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. రియ‌ల్ టైమ్‌లోనే రీల్ టైమ్ సినిమాగా తెర‌కెక్కించారు.
చదవండి: భీమ్లా నాయక్: పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో బెదిరించిన రానా
పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు