లాల్‌ సింగ్‌ చద్దా కోసం నాగ చైతన్య మేకోవర్‌

24 Jun, 2021 07:44 IST|Sakshi

కొత్త మేకోవర్‌ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు నాగ చైతన్య. లుక్‌ అండ్‌ బాడీ లాంగ్వేజ్‌ విషయాల్లో పర్‌ఫెక్షన్‌ కోసం ఫిట్‌గా రెడీ అవుతున్నారు. ఇదంతా... హిందీ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కోసమే అని టాక్‌. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట. అందుకే మేకోవర్‌ అవుతున్నారని తెలిసింది.

మరోవైపు ‘థ్యాంక్యూ’ తర్వాత చైతన్య ఓ యాక్షన్‌ మూవీ చేయనున్నారని సమాచారం. అందుకోసం కూడా మేకోవర్‌ అవుతున్నారట. వచ్చే నెలలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కొత్త షెడ్యూల్‌ లడఖ్, కార్గిల్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ఆమిర్, చైతన్యల మధ్య సీన్లు తీస్తారట. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు ఈ చిత్రం హిందీ రీమేక్‌. 

చదవండి: యూట్యూబ్‌లో సత్తా చాటుతున్న ‘మజిలీ’ హిందీ వెర్షన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు