Naga Chaitanya: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే

22 Aug, 2022 15:20 IST|Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం లాల్‌ సింగ్‌ చడ్డా మూవీకి బాయ్‌కాట్‌ సెగ అట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమాను బహిష్కించారంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ ఉన్నప్పటికీ కనీస వసూళ్లు కూడా చేయలేకపోతుంది. ఇదిలా ఉంటే ఇందులో చై బాలరాజు అనే ఆర్మి యువకుడిగా నటించగా.. తన పాత్రకు మంచి మార్కులు వచ్చాయి. లాల్‌ సింగ్‌ చడ్డా రిలీజ్‌కు ముందు నుంచి రిలీజ్‌ అనంతరం నాగ చైతన్య వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. 

చదవండి: ‘మెగాస్టార్‌’ అంటే ఓ బ్రాండ్‌.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో చైకి నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నెపోటిజం ప్రభావం​ అనేది బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాన పెద్దగా కనిపించదు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కావడం లేదు. దీని గురించి నన్ను అడిగినప్పుడల్లా నా అభిప్రాయం ఇదే. ఎందుకంటే మా తాత(అక్కినేని నాగేశ్వరరావు) ఓ నటులే. మా నాన్న(నాగార్జున) కూడా నటుడే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం కచ్చితంగా నాపై పడుతుంది కదా! వారిని చూసి నేనూ నటుడి కావాలని ఆశపడ్డాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటుడిని అయ్యాను. అలా వారు చూపించిన దారిలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ జర్నీ అలాగే కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.  

చదవండి: సెట్స్‌పైకి రజనీ ‘జైలర్‌’.. కొత్త పోస్టర్‌ రిలీజ్‌

ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఎప్పుడైనా ఓ సెల్ఫ్ మేడ్ స్టార్(ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చిన నటుడు) సినిమా, నా సినిమా ఒకేరోజు విడుదలయితే. వారి సినిమా రూ.100 కోట్లు సాధించి నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే.. అందరూ తనను ప్రశంసిస్తారు. ఇక దర్శక-నిర్మాతలు అతడినే ముందుగా అప్రోచ్‌ అవుతారు’ అని అన్నాడు. ఇక సినిమా ఫ్యామిలీ నుండి రావడం వల్ల తనకు బ్రేక్ ఈజీగానే దొరికిందని ఒప్పుకున్న నాగచైతన్య పరిశ్రమలోని పోటీ గురించి ప్రస్తావించాడు. ‘ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కొడుకు రేపు పెద్దయ్యాక అతడు కూడా హీరోనే అవుతాడు కానీ, నెపోటిజం పేరు చెప్పి అతడికి అడ్డు చెప్పగలడా’ అంటూ వివరణ ఇచ్చాడు నాగ చైతన్య.

మరిన్ని వార్తలు