నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి

10 Feb, 2021 08:33 IST|Sakshi

హీరో నాగచైతన్య, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కొద్దిసేపు పోలీస్‌ ఆఫీర్‌గా కనిపించారు నాగచైతన్య. ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేస్తున్నారు నాగచైతన్య.

అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లోనే హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇక నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
చదవండి: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య!
నాకూ ఫ్యాన్స్‌ ఉంటారని ఊహించలేదు

మరిన్ని వార్తలు