పెళ్లి పందిట్లో చైతూ, స‌మంత చిలిపి ప‌ని

10 Aug, 2020 15:48 IST|Sakshi

అతిథులు కొద్దిమందే అయినా రానా-మిహికాల పెళ్లి వేడుక‌లు మాత్రం అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ వివాహ వేడుక‌లో చైతూ-స‌మంత జంట సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో వీరిద్ద‌రూ క‌లిసి చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంది. అంద‌రూ పెళ్లి ప‌నుల్లో అంద‌రూ బిజీగా ఉంటే చైతూ మాత్రం సామ్‌ను ఆట‌ప‌ట్టించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. (మిహికా పెళ్లి డ్రెస్‌కు ప‌దివేల గంటలు ప‌ట్టింది)

ఆగ‌స్టు 8న రానా పెళ్లి కార్య‌క్ర‌మాల్లో భాగంగా వ్ర‌తాన్ని సైతం నిర్వ‌హించారు. వ్ర‌తం జ‌రుగుతున్న స‌మ‌యంలో అక్క‌డున్న‌ అతిథుల‌కు అక్షింత‌లు పంచి పెట్టారు. దీంతో అంద‌రూ అక్షింత‌లు చేత ప‌ట్టుకుని పూజ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. కానీ చైతూకి మాత్రం ఆ స‌మ‌యంలో ఓ చిలిపి ఆలోచ‌న త‌ట్టింది. వెంట‌నే బంధువుల మ‌ధ్య‌లో త‌న అర్ధాంగి ఎక్క‌డుందో వెతికి ప‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత చ‌ప్పుడు చేయ‌కుండా ఆమె వెన‌క నిలుచున్నారు. ఎవ‌రితోనో మాట్లాడుతున్న స‌మంత‌పై ఆమెకు తెలియ‌కుండా అక్షింత‌లు వేయ‌డం మొద‌లుపెట్టారు. దీన్ని ఎవ‌రో ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. (ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు)

"క్యూట్ క‌పుల్" అంటూ వీరిద్ద‌రినీ మెచ్చుకుంటున్నారు. "మా దిష్టే త‌గిలేలా ఉంది" అంటూ అభిమానులు తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా "కుటుంబంలోకి స్వాగతం" అంటూ అక్కినేని కోడ‌లు స‌మంత‌.. ద‌గ్గుబాటి కోడ‌లు మిహికా బ‌జాజ్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆత్మీయ స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. అంతేకాక కుటుంబం అంతా ఒక‌చోట చేరి దిగిన ఫ్యామిలీ ఫొటోను సైతం షేర్ చేయ‌గా ల‌క్ష‌లాది లైకులు వ‌చ్చిప‌డుతున్నాయి. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు