Naga Chaitanya On The Family Man: సామ్ వెబ్ సిరీస్ త‌న‌కు చాలా ఇష్ట‌మంటున్న నాగ‌చైత‌న్య‌

29 Nov, 2023 11:16 IST|Sakshi

అక్కినేని నాగ‌చైతన్య దూత వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. డిసెంబ‌ర్ 1 నుంచి ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు చై. ఈ సంద‌ర్భంగా అత‌డు స‌మంత న‌టించిన ద ఫ్యామిలీ మ్యాన్ త‌న ఫేవ‌రెట్ సిరీస్ అని పేర్కొన్నాడు. ఆ సిరీస్ త‌న‌కు చాలా బాగా న‌చ్చింద‌న్నాడు. కాగా ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజ‌న్‌లో స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే!

ఈ సిరీస్‌లో మ‌నోజ్ భాజ్‌పాయ్, ప్రియ‌మ‌ణి, శ‌ర‌ద్ కేల్క‌ర్‌, నీర‌జ్ మాధ‌వ్‌, ష‌రీబ్ హ‌ష్మీ, ద‌లీప్ తాహిల్‌, స‌న్నీ హిందూజ‌, శ్రేయ ధ‌న్వంత‌రి ప‌లువురు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇక‌పోతే నాగచైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతోంది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌కు చెందిన దాదాపు 25 మంది మ‌త్స్యకారులు బ‌తుకుతెరువు కోసం గుజ‌రాత్ తీర ప్రాంతంలోని వీర‌వ‌ల్ వ‌ద్ద చేప‌ల వేట కొన‌సాగిస్తూ .. 2018 న‌వంబ‌ర్‌లో పొర‌పాటున పాకిస్తాన్ స‌ముద్ర తీర అధికారుల‌కు బందీలుగా చిక్కారు.

దీంతో మ‌త్స్య‌కారులు దాదాపు ఏడాదిన్న‌ర‌పాటు అక్క‌డే బందీల‌య్యారు. జైలు జీవితం అనుభ‌వించిన వారి జీవితాల‌ను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో షూటింగ్ మొద‌లుకానుంది. ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందూ మెండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

చ‌ద‌వండి: నాగార్జున చేతికి బ్యాండ్ వెరీ స్పెష‌ల్‌.. ప్రతి ఏడాది డ‌బ్బులు క‌ట్టాల్సిందే?

మరిన్ని వార్తలు