మైసూర్‌లో సందడి చేయబోతోన్న ‘థ్యాంక్యూ’ మూవీ టీం!

3 Nov, 2021 07:38 IST|Sakshi

ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య అదే జోష్‌తో థ్యాంక్యూ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మనం(2014) తర్వాత దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌లో చైతూ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌లు హీరోయిన్లు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ను ముగించుకుంది.

చదవండి: సినిమాల్లోకి సుమ రీఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన యాంకర్‌

ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌కు కోసం చిత్ర బృందం రాజమండ్రి వెళుతుందని, అక్కడ మూడు రోజుల షెడ్యూల్‌ అనంతరం థ్యాంక్యూ టీం మైసూర్‌ వెళ్లనుందని సమాచారం. ఈ మైసూర్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మైసూర్‌ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ సహా సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. 

చదవండి: పైసా సంపాదన లేదు.. నా భార్య సంపాదనతో బ్రతికాను

మరిన్ని వార్తలు