Naga Chaitanya: 'థ్యాంక్‌ యూ' సినిమా అప్‌డేట్‌.. టీజర్‌ ఎప్పుడంటే ?

24 May, 2022 08:33 IST|Sakshi

Naga Chaitanya Thank You Teaser Release Date Announced: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. దిల్ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌ అలరించనున్నారు. అంతేకాకుండా అవికా గోర్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జూలై 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్‌ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మరో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం.

'థ్యాంక్‌ యూ' సినిమా టీజర్‌ను మే 25న సాయంత్ర 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్‌ చేస్తూ అధికారికంగా తెలిపింది. ఈ వీడియోలో 'ప్రియా నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్‌ చేయాలి' అంటూ నాగ చైతన్య డబ్బింగ్‌ చెబుతూ ఉంటాడు. తర్వాత టీజర్‌ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్‌ రవి కథ, పీసీ శ్రీరామ్‌ ఫొటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

చదవండి: 👇

సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ !
సమంత పర్సనల్‌ లైఫ్‌పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు