మరో ఆరు రోజుల్లో థ్యాంక్యూకు నాగచైతన్య గుడ్‌బై!

18 Jun, 2021 08:02 IST|Sakshi

థ్యాంక్యూ చిత్రానికి బైబై చెప్పననున్నారు నాగచైతన్య. మనం సినిమా తర్వాత నాగచైతన్య. దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవికాగోర్‌ కీలక పాత్రధారి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఓ ఆరు రోజుల చిత్రీకరణ జరుపుకుంటే థ్యాంక్యూ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని తెలిసింది.

ఈ ఆరు రోజుల చిత్రీకరణ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన వెంటనే తాను హిందీలో నటించనున్న తొలి చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా చిత్రీకరణలో పాల్గొంటారు నాగచైతన్య. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ఫారెస్ట్‌ గంప్‌కు హిందీ రీమేక్‌గా లాల్‌సింగ్‌ చద్దా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

చదవండి: నాగచైతన్య కార్ల కలెక్షన్స్‌ చూస్తే కళ్లు తిరగడం ఖాయం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు