పక్కింటి అబ్బాయిలా...

24 Nov, 2020 00:11 IST|Sakshi

పక్కా మాస్‌ లుక్‌లోకి మారిపోయారు నాగచైతన్య. గళ్ల లుంగీ, బనియన్‌తో ‘నేను మీ పక్కింటి అబ్బాయినే’ అనేట్లుగా కనిపించారు. సోమవారం చైతన్య బర్త్‌డే. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’లోని కొత్త లుక్‌ని విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘కొన్ని స్నేహాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. చైతన్యతో కలిసి పని చేయడం అలాంటి ఆనందాన్నే ఇస్తుంది.

హ్యాపీ బర్త్‌డే చైతన్య’’ అంటూ బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పారు శేఖర్‌ కమ్ముల. నిర్మాతలు నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావులతో పాటు సాయిపల్లవి కూడా చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆహ్లాదకర ప్రేమకథగా తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. థియేటర్లు ప్రారంభించాక సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ సి. కుమార్, సంగీతం: పవన్‌ సి.హెచ్, సహనిర్మాత: భాస్కర్‌ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఐర్ల నాగేశ్వరరావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు