కొత్త సినిమా షురూ

17 Oct, 2020 00:20 IST|Sakshi

నాగశౌర్య హీరోగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీగా ఉంటుంది. నాగశౌర్య సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘ఛలో’కు బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ అందించిన మహతి స్వరసాగర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: బుజ్జి.

మరిన్ని వార్తలు