Krishna Vrinda Vihari 2nd Day Collections: రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ‌ వ్రింద విహారి'

25 Sep, 2022 16:55 IST|Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయ‌ని, న‌టి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం.

అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్‌ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్  ముఖ్య పాత్రల్లొ నటించారు. 

మరిన్ని వార్తలు