ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్‌

1 Dec, 2021 17:47 IST|Sakshi

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆయనతో ఓ షాట్‌ ప్లాన్‌ చేశా, కానీ..

సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా’ అంటూ హీరోయిన్‌ హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటించింది. అలాగే జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్‌ 10వ థియేటర్లలో విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు