నాగశౌర్య షాకింగ్‌ లుక్‌ : టైటిల్‌ ఇదే

30 Nov, 2020 18:14 IST|Sakshi

 `ల‌క్ష్య` :  టైటిల్‌ ఖరారుచేసిన  చిత్ర యూనిట్‌

స్పెషల్‌ పోస్టర్‌

లక్ష్య : తనను తాను జయించే ప్రయాణం

 సాక్షి, హైదరాబాద్‌:  యంగ్‌హీరో నాగశైర్య  మరోసారి షాకింగ్‌ లుక్‌లో  ఫ్యాన్స్‌ను  విస్మయపర్చాడు. ఈ చిత్రానికి `ల‌క్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్‌  ఒక స్పెషల్‌ పోస్టర్‌ను సోమవారం  విడుదల చేసింది.  కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్‌గా నాగ‌శౌర్య లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. టాలీవుడ్‌లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్‌పై అభిమానులు ఫిదా అవుతున్నారు. (నాగశౌర్య సరసన హాట్‌ బ్యూటీ ఎంట్రీ)

ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్‌ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అటు ఈ మూవీలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణంతో  స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ ఇప్ప‌టికే అంద‌రినీ థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు