Nagababu Tweet: ఆయన ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు.. నాగబాబు ట్వీట్

7 Oct, 2022 19:29 IST|Sakshi

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చేసిన వ్యాఖ్యల పట్ల మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.  తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. 

ట్విటర్‌లో ఆయన రాస్తూ..  'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ  ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు