డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి చైతూ.. ‘అమెజాన్‌ ఫ్రైమ్‌’తో ఒప్పందం

5 May, 2021 14:04 IST|Sakshi

కరోనా పుణ్యమా అని ఓటీటీ సంస్థలకు డిమాండ్‌ పెరిగిపోయింది. కోవిడ్‌ భయానికి ప్రజలకు బయటకు వెళ్లకపోవడం, థియేటర్లు మూతపడడంతో డిజిటల్‌ మీడియా పుంజుకుంది. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలలో విడుదలఅవుతున్నాయి. దీంతో స్టార్‌ హీరో, హీరోయిన్లు సైతం డిజిటల్‌ ఎంట్రీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే  అజయ్‌ దేవగన్‌ లాంటి స్టార్‌ హీరోపాటు కాజల్‌, తమన్నా, సమంత లాంటి బడా హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌ సీరీస్‌ల బాటపట్టారు. ఇక ఇప్పుడిప్పుడే సౌత్‌ హీరోలు సైతం వెబ్‌ సిరీస్‌ల బాటపట్టారు. ఇప్పటికే కొంతమంది చిన్న హీరోలు వెబ్‌ సీరిస్‌లలో నటించారు. తాజాగా యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య కూడా డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే నాగచైతన్య భార్య సమంత.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. సమంత ఫస్ట్ వెబ్ సిరీస్ అది. దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2పై అక్కినేని అభిమానుల్లోనూఆసక్తి నెలకొనడంతో పాటు అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డిజిటల్ ఎంట్రీకీ రెడీ అవుతున్నాడనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో నాగచైతన్య ఒప్పందం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇదిలా ఉంటే నాగార్జున కూడా త్వరలో డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి కొడులలలో ఎవరు ముందు డిజిటల్‌ ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి.
చదవండి:
‘ఆదిపురుష్‌’ క్రేజీ అప్‌డేట్‌.. కీలక పా‍త్రలో స్టార్‌ హీరో
Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు?​
​​​​​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు