ఫైనల్‌ విన్నాక ఫైనలైజ్‌!

29 Dec, 2020 06:19 IST|Sakshi

అన్నం ఉడికిందా? లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకు చూస్తే చాలంటారు. అలాగే స్టోరీ బాగుంటుందా? లేదా అని తెలుసుకోవడానికి ‘స్టోరీ లైన్‌’ వింటే చాలని కొందరు సినీ ప్రముఖులు అంటుంటారు. లైన్‌ నచ్చితే మొత్తం కథ రెడీ చేయమని అడుగుతారు. ప్రస్తుతం నాగచైతన్యకి ఒక స్టోరీ లైన్‌ నచ్చిందట. కథ పూర్తి చేసి, ఫైనల్‌ వెర్షన్‌ వినిపిస్తే, సినిమా ఫైనలైజ్‌ చేస్తారట. ఇంతకీ చైతూ ఈ సినిమాని ఎవరితో చేస్తారంటే, ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌తో అని తెలిసింది. ఇటీవల తరుణ్‌ చెప్పిన లైన్‌ చైతూకి నచ్చి, ఫుల్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేయమన్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కుతుంది.
 

మరిన్ని వార్తలు