నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

3 Apr, 2021 16:17 IST|Sakshi

వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పటికప్పుడు తన పబ్లిసిటీని పెంచుకుంటారు. ఓ వైపు సంచలన సినిమాలను తీస్తూ, మరోవైపు పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌‌ ఆభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఓటు హక్కు ఉంటే సాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి నోముల భగత్‌కే ఓటు వేస్తానని ఆర్జీవీ అన్నారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

అదే విధంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళుతున్న నోముల భగత్‌ను తాను ఇష్టపడుతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీ నోములు భగత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నోముల భగత్‌ తండ్రి నోముల నర్సింహయ్య అకాల మరణంతో  నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. ఇక రామ్‌ గోపాల్‌వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు