Nagarjuna: 'శివ'కు ఈ సినిమాకు పోలిక లేదు: నాగార్జున

9 Jul, 2022 19:41 IST|Sakshi

Nagarjuna About The Ghost Movie: కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి 'కిల్లింగ్ మెషిన్' పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు మూవీ యూనిట్‌ సమాధానమిచ్చింది. 

నాగార్జున మాట్లాడుతూ.. ''ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.  సునీల్ నారంగ్ గారి నాన్నగారు  నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైంది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు 

దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. 'నాగార్జునతో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. స్టైలిష్ యాక్షన్ లో నాగార్జున అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది.  సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు. టెక్నికల్ టీం, డైరెక్షన్ టీమ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు.  

శివలో చైన్ పెట్టారు ఘోస్ట్ లో రెండు కత్తులు పెట్టారు మరో శివలా అంచనాలు పెట్టుకోవచ్చా ? 

నాగార్జున: శివకి దీనికి పోలిక లేదు. యాక్షన్ స్టైలిష్ గా డిజైన్ చేసిన క్రమంలో కత్తులు వచ్చాయి.  

ఎవరికీ ఘోస్ట్ గా వుంటారు ? 
నాగార్జున: ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్ కి కోడ్ నేమ్. 

ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారనిపించింది ? 
నాగార్జున: నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో తెలీదు. ఈ మధ్య రాజమౌళితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చింది. ''మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటేనే జనాలకి నచ్చుతుంది' అన్నారు. 

ప్రవీణ్ సత్తారు చెప్పిన కథలో కొత్త పాయింట్ ఏమిటి ? 
నాగార్జున:  ట్రీట్మెంట్, యాక్షన్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది.

ఈ చిత్రానికి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి ? 
సునీల్ నారంగ్: సాధారణమైన ధరలే ఉంటాయి. టికెట్ రేట్లు పెంచం. 

మిషన్ బేస్డ్ సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయి కదా .. ఘోస్ట్ కి సీక్వెల్ ఉంటుందా ? 
ప్రవీణ్ సత్తారు: ఇది మిషన్ బేస్డ్ సినిమా కాదు. మీరంతా రివ్యూలు చక్కగా రాసి సినిమా సూపర్ హిట్ అయితే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు( నవ్వుతూ) 

నాగార్జున మన్మధుడు కదా..  ఆయన్ని యాక్షన్ చేయించడానికి ఎంత కష్టపెట్టారు ? 
ప్రవీణ్ సత్తారు: నాగార్జున నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా అలోచించి ఒక యాక్షన్ బ్లాక్ పెడితే.. ఆయన వచ్చి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. 12 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. నాగార్జున చాలా ఫ్లెక్స్ బుల్ గా సూపర్ ఫాస్ట్ గా చేశారు.

యాక్షన్ లో కొత్తదనం ఏముటుంది ? 
ప్రవీణ్ సత్తారు: ఇందులోని యాక్షన్ కథలో కలసి ఉంటుంది. యాక్షన్ కూడా ఎమోషన్ లో బాగంగా ఉంటుంది. యాక్షన్ చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది.

మరిన్ని వార్తలు