Nagarjuna Akkineni and Amala: అలీ కూతురి వివాహ వేడుకలో అక్కినేని దంపతులు.. ఫోటోలు వైరల్

27 Nov, 2022 21:15 IST|Sakshi

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు  ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం నవంబర్ 27న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రోజు  జరిగిన అలీ కూతురు వివాహానికి నాగార్జున అక్కినేని తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నాగార్జున దంపతులు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

(చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌)

వివాహ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు అలీ ఆహ్వానాలు అందించారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి అలీ తన భార్య జుబేదా సుల్తానా బేగంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శుభలేఖలు అందించారు. కాగా..  అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు.

టాలీవుడ్‌లో నటుడు అలీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. 1979లో నిండు నూరేళ్లు చిత్రంతో అరంగేట్రం చేశారాయన. 

మరిన్ని వార్తలు