Nagarjuna Akkineni: ఇండస్ట్రీకి రెండు కళ్లు.. ఎన్టీఆర్‌ లీవ్స్‌ ఆన్‌..: నాగ్‌ కామెంట్స్‌

25 Jan, 2023 09:15 IST|Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.  గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించడంతో అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. దిగ్గజ నటుడైన అక్కినేని కించపరుస్తూ మాట్లాడటం సరికాదంటూ బాలకృష్ణపై మండిపడుతున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్

అదే విధంగా గతంలో దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి తారకరామారావు గురించి ప్రస్తావిస్తూ గౌరవప్రదంగా వ్యాఖ్యానించిన నాగార్జున పాత వీడియోను అక్కినేని ఫ్యాన్స్‌ పలు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలో వైరల్‌ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమా గత ఏడాది జనవరి 14న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ‘బంగార్రాజు’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ వేదికపై ఎన్టీఆర్‌ వర్ధంతిని గుర్తు చేసుకుని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫిలిం ఇండస్ట్రికి రెండు కళ్లు ఎప్పుటించో అంటుంటారు. ఒకటి నందమూరి తారకరామారావు గారు, ఇంకొకరు అక్కినేని నాగేశ్వరరావు.

చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌

ఈ రోజు జనవరి 18.. నందమూరి తారక రామారావుగారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకు మనం ఆయనను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్‌ లివ్స్‌ ఆన్‌.. అలాగే ఏయన్నార్‌ లివ్స్‌ ఆన్‌’’ అన్నారు’‘ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు నాగార్జున అంత బాగా మాట్లాడితే, జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి నాడు ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడటం సబబేనా? ఇదేనా బాలకృష్ణ సంస్కారం అంటూ అప్పటి నాగార్జున వీడియోను, ఇప్పటి బాలకృష్ణ వీడియోను అక్కినేని ఫ్యాన్స్‌ షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు