Nagarjuna: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున

12 Aug, 2022 08:41 IST|Sakshi

‘‘గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలను గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్‌గారు థియేటర్‌కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు’’ అన్నారు హీరో నాగార్జున. దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’.

చదవండి: విజయ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే!

హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ మూవీ థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్‌ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్‌ దుల్కర్‌కి వెళ్లింది (నవ్వుతూ).

చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ

ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘గీతాంజలి, సంతోషం, మన్మథుడు’ రోజులు గుర్తొచ్చాయి’’ అన్నారు. ‘‘నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు దుల్కర్‌. ‘‘నేను నాలుగు సినిమాలు తీశాను.. కానీ ‘సీతారామం’ వంటి ఆదరణ లేదు. ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది’’ అన్నారు హను. ‘‘నాగార్జునగారు మా బేనర్‌లో ఐదు సినిమాలు చేశారు.. ‘మహానటి, సీతారామం’తో మా బ్యానర్‌కి రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్‌ మా సొంత హీరో అయిపోయాడు’’ అన్నారు అశ్వనీదత్‌.

మరిన్ని వార్తలు