సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’

2 Aug, 2021 10:59 IST|Sakshi

షూటింగ్‌లో పాల్గొనేందుకు బంగార్రాజు రెడీ అవుతున్నాడు. 2016లో నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆ సంక్రాంతి పండక్కి ఓ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ప్రీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. షూటింగ్‌ను ఈ నెల 20న మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. సెట్స్‌ వర్క్‌ కూడా జరుగుతోందట. అంతేకాదు.. ‘సోగ్గాడే చిన్ని నాయనా..’ని సంక్రాంతికి విడుదల చేసినట్లే  ‘బంగార్రాజు’ని కూడా సంక్రాంతికి (2022) విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.  

మరిన్ని వార్తలు