బిగ్‌బాస్‌ ఈజ్‌ బ్యాక్‌

2 Aug, 2020 01:15 IST|Sakshi

రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌కి రెడీ అవుతోంది. మొదటి రెండు సీజన్లకు హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని కనిపించగా మూడో సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. నాలుగో సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జునే కనిపించనున్నారు.

దీనికి సంబంధించిన ప్రమోషనల్‌ యాడ్‌ షూట్‌ కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం బావుంది’’ అని ప్రోమో షూట్‌ ఫోటోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు నాగ్‌. ఈ యాడ్‌ను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ షూట్‌ చేశారు. సెంథిల్‌ కెమెరామేన్‌ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్‌ వర్క్‌ జరుగుతోంది.

సాధారణంగా హౌస్‌ సెట్‌ నిర్మించడానికి దాదాపు నెలరోజుల వరకు పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే చాలా మంది సినీ కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో సెట్‌ వర్క్‌కి ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. అలాగే ఈ సీజన్లో  పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ఇంకా పూర్తి కాలేదట. ఈ నెల చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి బిగ్‌బాస్‌ ప్రసారం కానుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు