ఏడు నెలల తర్వాత...

24 Oct, 2020 00:34 IST|Sakshi

నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఇటీవలే మొదలైంది. ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయిన నాగార్జున అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ప్రేక్షకులతో తన ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘హాయ్‌.. ఇది రోహ్‌తంగ్‌ పాస్‌ (రోహ్‌తంగ్‌ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్‌ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు.

‘వైల్డ్‌ డాగ్‌’ షూటింగ్‌ ఇక్కడ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్‌ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్‌) వచ్చేస్తాను. లవ్‌ యు ఆల్‌. సీ యు’’ అని పేర్కొన్నారాయన. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున నటిస్తున్నారు. దియా మీర్జా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎ¯Œ .ఎం. పాషా, జగన్మోహన్‌ వంచా, కెమెరా: షానీల్‌ డియో.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు