Nagarjuna Akkineni: నాగార్జున చేతుల మీదుగా డెత్‌ గేమ్‌ టీజర్‌

14 Jan, 2022 09:36 IST|Sakshi

అమర్‌నాథ్‌ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్‌ హీరో హీరోయిన్లుగా చేరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘డెత్‌ గేమ్‌’. కేసీ సూరి, రాజశేఖర్‌ నాయుడు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను నాగార్జున విడుదల చేశారు. టీజర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేకపోవడం గమనార్హం. కేవలం మ్యూజిక్‌తోనే టీజర్‌ రిలీజ్‌ చేశారు.  

‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అమర్‌నాథ్‌. ‘‘టాకీ పార్ట్‌ పూర్తయింది. మార్చిలో సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చేరన్‌. ఈ సినిమాకు మాటలు: శ్రీనివాస్‌ చింత, పాటలు: వరికుప్పల యాదగిరి, సంగీతం: ఎమ్‌.ఎమ్‌ మహి. 

మరిన్ని వార్తలు