‘అన్‌స్టాపబుల్‌’ టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున

27 Dec, 2022 04:35 IST|Sakshi
డైమండ్‌ రత్నబాబు, సన్నీ, నాగార్జున, రజిత్‌ రావు

బిగ్‌ బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ అన్నది ఉపశీర్షిక. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రజిత్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘అన్‌స్టాపబుల్‌’ టీజర్‌ను హీరో నాగార్జునతో విడుదల చేయించారు. ‘ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా’ అంటూ 30 ఇయర్స్‌ పృథ్వీ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ సాగుతుంది.

‘‘డైమండ్‌ రత్నబాబు తన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే రసవత్తరంగా ఉంటుంది. భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓ అసెట్‌. రఘుబాబు, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పాత్రలు నవ్వులు పంచే విధంగా ఉంటాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: వేణు మురళీధర్, కో ప్రొడ్యూసర్‌: షేక్‌ రఫీ, బిట్టు, రాము ఉరుగొండ. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు