యుద్ధ విద్యల్లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న నాగ్‌

17 Jun, 2021 00:41 IST|Sakshi

పోరాట సన్నివేశాల్లో హీరో నాగార్జున శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు తన యాక్షన్‌ స్టైల్‌కు మరింత పదును పెడుతున్నారు నాగార్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాజీ రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా కనిపించనున్నారు నాగార్జున. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కోసం క్రావ్‌ మాగా, సమురై స్వార్డ్‌ వంటి ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో నాగార్జున స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్‌ సెకండ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో వీలైనంత తొందరగా చిత్రీకరణ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు అండ్‌ కో. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ‘రా’ ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారు.

మరిన్ని వార్తలు