అప్పుడు డిప్రెస్‌ అయ్యా!

2 Mar, 2021 00:23 IST|Sakshi
అహిషోర్, నాగార్జున, నిరంజన్‌రెడ్డి

– నాగార్జున

‘‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను డీటీఎస్‌ సౌండ్‌లో పెద్ద తెరపై చూస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందుతారు. పైగా థియేటర్లు తెరవడం, ప్రేక్షకులు కూడా వస్తుండటంతో మా సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని నాగార్జున అన్నారు. అహిషోర్‌ సాల్మన్‌  దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్‌ ఇతర పాత్రల్లో నటించారు. నిరంజన్‌  రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు.

నాగార్జున మాట్లాడుతూ– ‘‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నాం. 37 ఏళ్లుగా షూటింగ్‌లతో బిజీగా ఉండేవాణ్ణి. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే సమయం దొరికింది. కానీ షూటింగ్‌లు లేకపోవడంతో డిప్రెషన్‌ గా అనిపించింది. నా జీవితంలో నుంచి 2020 తీసేశాను. ‘ఊపిరి’ చిత్రం సమయంలో సాల్మన్‌  ప్రతిభను గుర్తించాను. సాల్మన్‌ తో సినిమా చేద్దామని నిరంజన్‌  రెడ్డి అనగానే ఓకే అన్నాను. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా ఉంటుంది. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
‘‘తెలుగు సినిమాలో ‘వైల్డ్‌ డాగ్‌’ ఓ కొత్త ప్రయత్నం.. హిట్‌ అవుతుందనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేస్తున్నాం. 45 రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదలవుతుంది’’ అన్నారు నిరంజన్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు