అఖిల్‌ మూవీ పై నాగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

26 Mar, 2021 13:13 IST|Sakshi

ఈ వేసవి అక్కినేని వారసులు నాగార్జున,అఖిల్ కు చాలా కీలకం కానుంది. నాగ్ నటించిన ‘వైల్డ్ డాగ్’, ‘అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వరుసగా ఏప్రిల్ 2, జూన 19న వెండితెరపైకి వస్తున్నాయి. నాగ్‌కు ‘సోగ్గాడే చిన్నినాయినా’ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ మళ్లీ రాలేదు. ఇక అఖిల్‌ విషయానికొస్తే అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది. అఖిల్ లుక్స్‌‌ పరంగా హాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌లా ఉంటాడు, డాన్స్‌ కూడా ఇరగదీస్తున్నాడు, తను ఎంచుకున్న కథలు, పాటలు, ఇలా అన్నీబాగున్న ఏ కారణంగానో బాక్సాఫీస్‌ ముందు బోల్తాపడుతున్నాయి. ప్రస్తుతం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విజయం అఖిల్‌కు చాలా ముఖ్యం, దీనిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

అఖిల్‌ మూవీ  స్క్రిప్ట్ కూడా తెలీదు: నాగ్‌ 
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున తన సొంత నిర్ణయాలు ఆలోచించి తీసుకునేంత తెలివి అఖిల్‌ కు ఉందని కాబట్టి తన కథల ఎంపిక, స్క్రిప్ట్ విషయంలో ఎటువంటి సలహాలు ఇవ్వడం లేదని వెల్లడించాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నాగ్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సంబంధించిన  స్క్రిప్ట్ కూడా తెలియదని చెప్పాడు.

అఖిల్ కెరీర్ గురించి ప్రస్తావిస్తూ అతి ముఖ్యమైన విషయం ఏమంటే అఖిల్‌ను హీరోగా  ప్రేక్షకులు అంగీకరించారు అది వాడికి లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక విజయం సాధించడానికి ముందు కొంత సమయం పడుతుంది అని నేను భావిస్తున్నాను అని నాగ్ అన్నారు. పుత్రుడు ఎదిగినప్పుడు కంటే ప్రయోజకుడైనప్పుడే కదా తండ్రికి అసలైన ఆనందం అన్నట్లు ప్రస్తుతం నాగ్‌ అఖిల్ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్‌  19న విడుదల కానుంది.   ( చదవండి: అఖిల్‌ బ్యాచ్‌లర్‌ గుట్టు తెలిసేది అప్పుడే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు