ప్రతి పాట వజ్రంలా ఉంటుంది

10 Jan, 2022 05:29 IST|Sakshi
కల్యాణ్‌ కృష్ణ, అనూప్‌ రూబెన్స్, కృతీ శెట్టి, నాగచైతన్య, నాగార్జున, ప్రసాద్‌

– నాగార్జున

‘‘బంగార్రాజు’ చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్‌ హిట్‌ ఆల్బమ్‌. లిరిక్‌ రైటర్స్‌ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బంగార్రాజు మ్యూజికల్‌ నైట్‌’ లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) సంక్రాంతికి దుమ్ములేపారు.. ఆ చిత్రం కూడా మ్యూజికల్‌ హిట్‌. సినిమా సక్సెస్‌లో సగ భాగం మ్యూజిక్‌దే. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్‌ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ ను తీసుకొస్తున్నాం’’ అన్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘బంగార్రాజు’ ఆడియోను పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. అనూప్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. మా లిరిక్‌ రైటర్స్‌కి థ్యాంక్స్‌. ఇది పండుగ లాంటి సినిమా. అందరూ చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అన్నారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కల్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ–‘‘సినిమా సక్సెన్‌ స్థాయిని నిర్ణయించేది సంగీతమే. ‘బంగార్రాజు’ కు ఇంత మంచి సంగీతం ఇచ్చిన అనూప్‌ రూబెన్స్‌కి థ్యాంక్స్‌. నాగ్‌ సర్‌ ప్రతి సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టరే. ‘బంగార్రాజు’  పాటలు కూడా అలాగే ఉంటాయి. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగ్‌ సారే.. ఇప్పుడు ఆయ నకు పోటీగా చిన్న బంగార్రాజు(నాగచైతన్య) ఎక్కడా తగ్గలేదు’’ అన్నారు. ‘‘ఈ మ్యూజికల్‌ నైట్‌తోనే సంక్రాంతి ప్రారంభమైనట్టుంది’ అని నిర్మాత జీ స్టూడియోస్‌ ప్రసాద్‌ అన్నారు. హీరోలు సుమంత్, సుశాంత్, నిర్మాత నాగ సుశీల, కెమెరామేన్‌ యువరాజ్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు