హిమాలయాలకు వీడ్కోలు

7 Nov, 2020 00:09 IST|Sakshi

ఏసీపీ విజయ్‌వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్న చిత్రం ’వైల్డ్‌ డాగ్‌’. దియా మిర్జా హీరోయిన్‌ గా కీలక పాత్రలో సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్‌ మనాలీలో జరిగింది. నాగార్జున పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి కావడంతో హైదరాబాద్‌ వచ్చేశారు. ’’నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాలకు వీడ్కోలు చెప్తుంటే బాధగా అనిపించింది’’ అంటూ  తన తోటి నటీనటులతో హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేశారు నాగార్జున. ఇతర నటీనటులతో మనాలీలో షూటింగ్‌ జరుగుతోంది. అక్కడి షెడ్యూల్‌ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు ఆరంభిస్తారు. ఈ చిత్రానికి మాటలు: కిరణ్‌ కుమార్, కెమెరా: షానీల్‌ డియో.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు