Lakshya Movie Release Date: నాగశౌర్య 'లక్ష్య' చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?

24 Nov, 2021 17:51 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం 'లక్ష్య' విడుదల తేదీని ఖరారైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో దృఢమైన శరీరాకృతితో పోనీ టేల్‌తో వర్షంలో విల్లు, బాణాన్ని పట్టుకుని స్టైల్‌గా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో రానుంది. దీంట‍్లో పార్థు అనే క్రీడకారుడి పాత్రలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా కోసం నాగశౌర్య భారీగా వర్క్‌అవుట్స్‌ చేసి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నాడు. నాగశౌర్య ఇంతకుముందు సినిమా 'వరుడు కావలెను' బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. 

A post shared by Naga Shaurya (@actorshaurya)

పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను లక్ష్య సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. సోనాలి నారంగ్‌ సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ శరత్ మరార్‌, నారయణ దాస్‌ కె, నారంగ్‌, పుస్కుర్‌ రామ్ మోహన్ రావు, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌ కలిసి నిర‍్మిస్తున‍్నాయి. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు కీలక పాత‍్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా కేతిక శర్మ చేస్తున్నారు. చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, రామ్‌ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. 

 

మరిన్ని వార్తలు