'నా బంగారు కొండకు సర్జరీ అనగానే హృదయం ముక్కలైంది'

23 Apr, 2021 13:27 IST|Sakshi

డాక్టర్లు అతడికి ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచిది అని చెప్పారు. నా బంగారు కొండకు సర్జరీ అనగానే

బుల్లితెర నటుడు నకుల్‌ మెహతా ఇటీవలే తండ్రైన విషయం తెలిసిందే. నకుల్‌-జాన్కీ పరేశ్‌ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి కొడుకు జన్మించాడు. దీంతో ఈ జంట ఆనందంలో మునిగి తేలింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పిల్లవాడు రెండు నెలల వయసు వచ్చేసరికి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు అతడిని పరీక్షించి సర్జరీ చేయాల్సిందేనని చెప్పారు. దీంతో ఆ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అంత చిన్నపిల్లవాడికి సర్జరీ చేయడమేంటి? అని బాధపడింది. తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

"అసలు ఈ విషయం చెప్పాలనుకోలేదు, కానీ మీలో చాలామంది అన్నింటినీ మాతో షేర్‌ చేసుకుంటున్నప్పుడు నేను కూడా ఇది చెప్పడం మంచిదే అనిపించింది. మూడు వారాల క్రితం నా బుజ్జి సూఫీకి బైలేటరల్‌ ఇంగ్వినల్‌ హెర్నియా ఉందని తెలిసింది. డాక్టర్లు అతడికి ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచిది అని చెప్పారు. కానీ నా బంగారు కొండను మత్తులో ఉంచి సర్జరీ చేస్తారన్న ఊహకే నా గుండె పగిలిపోయింది. భోరుమని ఏడ్చాను, ఆ రోజు నా కన్నీళ్ల ధారలు ఆగకుండా ప్రవహించాయి. సర్జరీ చేయడానికి ముందు 2 గంటలు, తర్వాత 4 గంటలు అతడు మత్తులోకి జారుకుంటాడు.

కాబట్టి వాడిని తెల్లవారుజామున మూడు గంటలకే లేపి తినిపించి పడుకోబెట్టాలి.  ఇది వాడికి అలవాటు కావాలి. ఎందుకంటే తర్వాత నాలుగన్నర గంటల వరకు అతడు లేవకూడదు, మధ్యలో ఆకలి అంటూ పాలు అడగకూడదు కదా.. బుజ్జి కన్నయ్యకు అన్నీ చెప్పేదాన్ని.. నా మాటలు వింటున్నట్లు వాడు నా ముఖాన్ని అలానే చూసేవాడు. సర్జరీ రోజు కూడా మేం అనుకున్నట్లుగానే జరిగింది. వాడు నిద్రపోగానే డాక్టర్ల చేతిలో పెట్టాను. శస్త్ర చికిత్స పూర్తవగానే బోలెడంత మాట్లాడుకున్నాం. 2 గంటలకోసారి పాలు తాగే ఈ చిన్నోడు ఆరోజు మాత్రం 7 గంటలు తాగకుండా ఉన్నాడు. వాడు ఏ పెద్ద సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డాడు. పాలు పట్టినప్పుడు వాడి కళ్లల్లో కనిపించిన ఆనందం వెల కట్టలేనిది" అని రాసుకొచ్చింది.

కాగా 2012లో వచ్చిన ప్యార్‌ కా దర్ద్‌ హై మీఠా మీఠా ప్యారా ప్యారాతో బుల్లితెర మీద సందడి చేశాడు నకుల్‌ మెహతా. అదే ఏడాది జాన్కీ పరేఖ్‌ను పెళ్లి చేసుకున్నాడు. నకుల్‌ పలు మ్యూజిక్‌ వీడియోలతో పాటు, యాడ్స్‌లోనూ నటించాడు. హాల్‌ ఈ దిల్‌ అనే సినిమాతో వెండితెర మీద అడుగు పెట్టాడు. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ 6 సీజన్‌కు హోస్ట్‌గానూ రాణించాడు.

A post shared by Jankee Parekh Mehta (@jank_ee)

చదవండి: చిన్నపిల్లలా మారిపోయిన అనసూయ: 'ఇప్పుడిది అవసరమా?'

కొలిక్కిరాని వివాదాలు! శంకర్‌ స్పందన కోసం వెయిటింగ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు