Nakuul Mehta: రణ్‌వీర్‌ సింగ్‌ను అనుకరించిన నటుడు, నిజంగానే అంత సాహసం చేశాడా?

26 Jul, 2022 16:52 IST|Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటోషూట్‌ నెట్టింట ఎంత రచ్చ లేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ ధైర్యానికి సలామని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో ఈ తెలివితక్కువ పనేంటని బుగ్గలు నొక్కుకున్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ నటుడు కూడా రణ్‌వీర్‌ను ఫాలో అయ్యాడు. అతడిలాగే ఒంటిమీద నూలు పోగు లేకుండా దర్శనమిద్దామనుకున్నాడు. అనుకోవడమేంటి, ఆలోచన అమల్లో పెట్టేశాడు. అచ్చం రణ్‌వీర్‌ సింగ్‌లా పోజు పెట్టిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు.

ఇది చూసిన నెటిజన్లు అటు మెచ్చుకోకుండా, ఇటు నొచ్చుకోకుండా పడీపడీ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో కనిపించేదంతా నిజం కాదు. రణ్‌వీర్‌ 'పేపర్‌' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోను ఎడిట్‌ చేసి దానికి తన ముఖాన్ని అతికించాడు. తాను కూడా స్టోన్‌ మ్యాగజైన్‌ కోసం ఇలా మారానంటూ జోక్‌ చేశాడు. మొత్తానికి నకుల్‌ ఎడిటింగ్‌ టాలెంట్‌ చూసిన అభిమానులు నవ్వాపుకోలేకపోతున్నారు. అతడి భార్య జంకీ అయితే.. 'వెంటనే అతడికి పొట్టినిక్కర్లు పట్టుకెళ్లాల్సిందే' అని ఫన్నీగా కామెంట్‌ చేసింది. కాగా నకుల్‌ ప్యార్‌కా దర్ద్‌ హై మీఠా మీఠా, ఇష్క్‌బాజ్‌, బడే అచ్చె లగ్తే హై వంటి సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు.

A post shared by Nakuul Mehta (@nakuulmehta)

చదవండి: హోంటూర్‌ వీడియోను షేర్‌ చేసిన యాంకర్‌ శ్యామల
ఆమె గొంతు పూర్తిగా పడిపోయింది: నటి శ్రీవాణి భర్త

మరిన్ని వార్తలు