Namitha: 41 ఏళ్లకి ప్రెగ్నెంట్‌.. కొత్త ఫీలింగ్స్‌ అంటూ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

10 May, 2022 11:28 IST|Sakshi

ఇటీవల కాలంలో సినీ తారలు  తాము తల్లి కాబోతున్నామనే విషయాన్ని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అంతేకాదు బేబి బంప్ ఫొటోల‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ అగ్రహీరోయిన్‌ కాజల్‌ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్‌ ప్రణీత, సంజన గల్రాని తాము ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ.. ఫోటోలను షేర్‌ చేసుకున్నారు.

(చదవండి: నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్‌ బాబు)

తాజాగా మరో హీరోయిన్‌ కూడా తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తెలుగులో ‘సొంతం’, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించిన నమిత.. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

ఈ రోజు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘మాతృత్వం.. నా జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది. నాలో ఏదో మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది.  కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఇంత‌కు ముందెన్న‌డూ లేని ఫీలింగ్స్ ’అంటూ నమిత రాసుకొచ్చింది. కాగా, 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు