కొత్తగా మారిపోయా!

11 May, 2022 05:37 IST|Sakshi

నమిత ఫోన్‌ మంగళవారం ఫుల్‌ బిజీ. ఎందుకంటే

నమిత ఫోన్‌ మంగళవారం ఫుల్‌ బిజీ. ఎందుకంటే మంగళవారం (మే 10) ఆమె బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌ డే’  చెప్పేందుకు బంధువులు, అభిమానులు ఫోన్‌  చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే ‘హ్యాపీ బర్త్‌ డే’తో పాటు ‘కంగ్రాట్స్‌’ చెప్పిన ఫోన్‌ కాల్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... తాను తల్లి కాబోతున్న విషయాన్ని తన బర్త్‌ డే సందర్భంగా నమిత ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా వెల్లడించి, కొత్త ఫోటోలను షేర్‌ చేశారు.

దాంతో ‘కంగ్రాట్స్‌...నమిత’ అని ఇటు సినీ సెలబ్రిటీలు అటు అభిమానులు ఆమెకు సందేశాలు పంపడం, ఫోన్‌కాల్స్‌ చేయడం వంటివి చేశారు. ‘‘నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవగానే నేను మారిపోయాను. నేను నీ కోసం (పుట్టబోయే బిడ్డ గురించి...) ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు నమిత. 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 

మరిన్ని వార్తలు