నవ్వుల నమో 

11 Dec, 2023 04:20 IST|Sakshi
విశ్వంత్‌,అనురూప్‌ కటారి,విస్మయ శ్రీ

విశ్వంత్‌ దుద్దంపూడి, అనురూప్‌ కటారి హీరోలుగా, విస్మయ శ్రీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎ. ప్రశాంత్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు.

ఏదో చేయాలనే, నేర్చుకోవాలనే తపన తనలో ఉంది. ‘నమో’ పేరు వినగానే ప్రధాని నరేంద్ర మోదీగారి మీద కథ అనుకున్నాను. హీరోల పాత్రల పేర్లలోని (నగేశ్, మోహన్‌) తొలి అక్షరాలతో టైటిల్‌ పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నమో’ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆదిత్య రెడ్డి కుందూరు. ‘‘ఇదొక వైవిధ్యమైన చిత్రం’’ అన్నారు విశ్వంత్‌ దుద్దంపూడి, అనురూప్‌ కటారి, విస్మయ.

>
మరిన్ని వార్తలు