Namrata Shirodkar: నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో నిలిచిపోయింది.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌

1 Feb, 2023 12:10 IST|Sakshi

వెండితెరపై హీరోయిన్‌గా వెలిగిన నమ్రత శిరోద్కర్‌ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే మహేశ్‌బాబుకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది. తాజాగా ఆమె తన తండ్రి నితిన్‌ శిరోద్కర్‌ను తలుచుకుని ఎమోషనలైంది.

'16 ఏళ్లుగా నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నా పప్పా.. నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలాగే ఉండిపోయింది. ఏమీ మారలేదు.. నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలేసి పోయావు పప్పా.. అనంతమైన ప్రేమను, వెలుగులను నిత్యం నీకు పంపిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

చదవండి: 

మరిన్ని వార్తలు