మహేశ్‌ అందంపై కీర్తి కామెంట్‌..రిప్లై ఇచ్చిన నమ్రత

10 Aug, 2021 21:17 IST|Sakshi

Keerthi Suresh Suggestion Namrata Shirodkar : టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్ హీరో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఆయన అందానికి ఫిదా కాని వాళ్లు అమ్మాయిలెవరూ ఉండరేమో. అందుకే అత్యధిక లేడీ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మహేశ్‌ ముందుంటారు. 46 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌లుక్‌లో కనిపిస్తూ కుర్ర హీరోలకు సైతం షాకిస్తున్నాడు. వయసు పెరిగేకొద్దీ మరింత సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారాయన.

కాగా నిన్న(ఆగస్టు9)న మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా పలవురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ సైతం మహేశ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..నమ్రత మేడమ్‌..మహేశ్‌ సార్‌ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి అంటూ ఓ పోస్టును షేర్‌ చేసింది. దీనిపై స్పందించిన నమ్రత..సరే అంటే రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో  కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు