ఆ ట్రిప్‌ మరవలేనిది.. మేమిద్దరమే ఎంజాయ్‌ చేశాం: నమ్రత

21 Apr, 2021 15:39 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే.షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ప్రిన్స్‌.. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అయితే మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే గడిపేశాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ  ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

మహేశ్‌ బాబు షూటింగ్స్‌ కోసం విదేశాలకు వెళ్తే.. తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన మహేశ్‌.. భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌ని కూడా వెంట తీసుకెళ్లాడు. మహేశ్‌ షూటింగ్‌లో పాల్గొంటే.. సితారా కొడుకుతో కలిసి అక్కడి పర్వతాలను చుట్టేసిందట. అక్కడి అందమైన లోకేషన్స్‌ అన్ని వీక్షించి ఎంజాయ్‌ చేసిందట. ఆ రోడ్‌ ట్రిప్‌ ఎన్నటికీ మరచిపోలేనిదంటూ.. గౌతమ్‌తో దిగిన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరలయింది. ఇది చూసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌.. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, సో క్యూట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు