SVP Success Party Photos: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ పార్టీ.. ఫోటోలు వైరల్‌

14 May, 2022 16:53 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల రాబడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ .. మూవీ యూనిట్‌కి శుక్రవారం విందు ఏర్పాటు చేసింది.

(చదవండి: 'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..)

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ పార్టీలో మహేశ్‌బాబు, నమ్రతలతో పాటు దర్శకుడు పరశురామ్‌, సుకుమార్‌, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్‌, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని నమ్రత రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు