Nandamuri Balakrishna: అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

26 Jan, 2023 16:49 IST|Sakshi

సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లెజెండరి నటులు దివంగత నాగేశ్వరరావును ఉద్దేశించిన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దూమారం లేపాయి. దీంతో బాలయ్య క్షమాపణలు చెప్పాలటూ అక్కినేని అభిమానులంతా డిమాండ్‌ చేశారు. దీంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యాలపై స్పందించిన బాలయ్య  వివరణ ఇస్తూనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ఎన్టీఆర్‌ వర్థంతి నాడు నాగ్‌ అలా.. ఏఎన్‌ఆర్‌ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..

‘నాగేశ్వరరావు గారు నాకు ఎప్పుటికి బాబాయే. ఆయన అంటే నాకు చాలా గౌరవం.ఆయన కూడా నన్ను తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. నన్ను అప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే అక్కడ లేని(అక్కినేని కుటుంబంలో) అప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి. గుర్తు పెట్టుకోండి’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బాలయ్య కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

కాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో బాలయ్య చేసిన ‘అక్కినేని-తొక్కినేని’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు