Akhanda Trailer: డైలాగుల‌తో బాల‌య్య గ‌ర్జ‌న‌

14 Nov, 2021 19:44 IST|Sakshi

Nandamuri Balakrishna Akhanda Trailer Released: సింహా’, ‘లెజెండ్‌’ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. ఆదివారం ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. 'విధికి, విధాత‌కు, విశ్వానికి స‌వాళ్లు విస‌ర‌కూడ‌దు' అన్న డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. 'అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డ్యామా? ప‌ట్టిసీమ తూమా? పిల్ల‌కాలువ' అని డైలాగ్‌తో గ‌ర్జించాడు బాల‌య్య‌.

ఆశ చ‌చ్చిపోయిన‌ప్పుడు, న‌మ్మ‌కానికి చోటు లేన‌ప్పుడు, విధ్వంస శ‌క్తులు విరుచుకుప‌డిన‌ప్పుడు అఖండ వ‌స్తాడు, కాపాడ‌తాడు అంటూ బాల‌య్య అఘోరాగా న‌టించిన‌ మ‌రో పాత్ర అఖండ‌ ప‌వ‌ర్ గురించి చెప్పారు. 'ఒక మాట నువ్వంటే అది శ‌బ్ధం, అదే మాట నేనంటే శాస‌నం, దైవ శాస‌నం'', మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్‌' అని అఘోరాగా బాల‌య్య గ‌ర్జించిన డైలాగులు మాస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తున్నాయి. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు