‘అఖండ’ రికార్డు.. జై బాలయ్య.. నీకు ఎదురే లేదయ్యా

22 Apr, 2021 14:44 IST|Sakshi

సీనియర్లకు సవాల్‌ విసురుతున్న ‘నటసింహం’

నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుదంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. అందులోనూ బోయపాటి శ్రీనుతో సినిమా అంటే..ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి.‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్‌ 13న విడుదలైన టైటిల్‌ రోడ్‌ ‘అఖండ’ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త లుక్‌లో బాల‌య్య క‌నిపించడం, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం అదిరిపోవడంతో ఈ టీజర్‌ సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ టీజర్ ఇప్పటికే ఈ టీజర్ 33మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలుకొట్టింది. 386k పైగా లైక్స్‌తో ‘అఖండ’ దూసుకెళ్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య బ్యాచ్ ఇంత వరకు ఏ హీరోకి రానన్ని వ్యూస్‌, లైకులు ఈ టీజర్‌ దక్కించుకుంది.

ఇటీవల విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌కి 19మిలియన్లు వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ రెండు చిత్రాల టీజర్ల‌పై చర్చ జరుగుతోంది. చిరంజీవి సినిమా టీజర్‌ను మించి ఎక్కువ వ్యూస్‌ సాధించడంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య.. నీకు ఎదురే లేదయ్యా’అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'అఖండ'లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా... ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు