మీ వల్లే ఇంతటివాడినయ్యాను, ప్లీజ్‌..: బాలయ్య

8 Jun, 2021 15:36 IST|Sakshi

అభిమానులకు బాలయ్య విన్నపం

అభిమానులను ఎంతగానో ఆదరించే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తన అభిమానులకు ఏ కష్టం వచ్చినా వారికి సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. ఆరోగ్యం బాగోలేదంటే ఫోన్‌ కాల్‌ చేసి క్షేమసమాచారాలతో పాటు కుటుంబ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుంటాడు. అభిమానులకు కొండంత అండగా ఉండే ఈ హీరో సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్‌ చేస్తున్న పోస్ట్‌ ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ నెల 10న బాలయ్య బర్త్‌డే. పుట్టిన రోజు అనగానే ఎందరో ఫ్యాన్స్‌ ఆయనను కలవాలని, విషెస్‌ చెప్పి ఫొటో దిగాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కరోనా ఉధృతి కారణంగా ఎవరూ తనను కలిసేందుకు రావద్దని బాలయ్య సోషల్‌ మీడియాలో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

"నా ప్రాణ సమానులైన అభిమానులకు ప్రతి ఏటా జూన్ 10వ తేదీ పుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అంత మంచిది కాదు. మీ అభిమానం వల్లే నేను ఇంతటివాడినయ్యాను. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సులు లేవు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేవు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవరూ నా వద్దకు రావద్దని మరీ మరీ తెలియజేస్తూ.. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను" అని బాలకృష్ణ పోస్ట్‌ పెట్టాడు.

చదవండి: బాలయ్య బర్త్‌డేకు మూడు సర్‌ప్రైజ్‌లు!

బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు