Nandamuri Balakrishna: బాలయ్య స్టెప్పులు.. అభిమానుల కేకలు

22 Jul, 2022 15:50 IST|Sakshi
షూటింగ్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ 

బనగానపల్లె రూరల్‌(కర్నూలు జిల్లా):  యాగంటి ఆలయ ఆవరణలో గురువారం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్‌ జరిగింది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై మలినేని గోపిచంద్‌ దర్శకత్వంలో తీస్తున్న చిత్రానికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించారు.
చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్‌ షాకింగ్‌ రియాక్షన్‌


ఆలయంలోని పెద్దకోనేరు, ధ్వజ స్తంభం, శ్రీ వెంకటేశ్వరస్వామి గుహల వద్ద సుమారు 150 మంది డ్యాన్సర్ల్లతో ఈ పాటను ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు చిత్రీకరించారు. షూటింగ్‌ సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్‌లో బాలకృష్ణ స్టెప్పులు వేస్తుండగా అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఎస్‌ఐలు శంకర్‌నాయక్, రామాంజనేయరెడ్డి బందోబస్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు