బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ విడుదల

21 Oct, 2020 08:43 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో గతంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌ బాబు నటించారు. ఈ  చిత్రంలోని దాదాపు 17 నిముషాల సన్నివేశాలను శ్రేయాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా ఎన్‌బీకే థియేటర్‌లో ఈ నెల 24న తిలకించే అవకాశం కల్పిస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నాం. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు